ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ కమిటీ ఆఫీస్ లో మందుబాబులు..!
TeluguStop.com
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మార్కెట్ కమిటీ కార్యాలయం వైన్ షాపును తలపిస్తోంది.ఆఫీస్ లో పని చేసే సిబ్బంది పట్టపగలే మద్యం తాగుతూ కాలక్షేపం చేసిన ఘటన కలకలం రేపుతోంది.
మార్కెట్ కమిటీ కార్యాలయంలోని టేబుల్ కు ఓ వైపు ఫైల్స్, మరోవైపు మందు గ్లాసులతో కాలక్షేపం చేశారు ఆఫీస్ సిబ్బంది.
తాగుబోతు ఉద్యోగులతో కార్యాలయానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.విధుల్లో మందు తాగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగుల పీర్ సాహెబ్, నాగరాజులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంతా జరుగుతున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
డైట్ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పొడి మీకోసమే!