దేవర థర్డ్ సింగిల్ క్రేజీ అప్ డేట్ ఇదే.. ఆరోజే థర్డ్ సింగిల్ తో మోత మ్రోగనుందా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర( Devara ) నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి.

ఈ సినిమా థర్డ్ సింగిల్, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన ట్వీట్ లో దావుడి( Daavudi ) అనే పేరుతో దేవర థర్డ్ సింగిల్ రిలీజ్ కానుందని చెప్పుకొచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఆన్ ఫైర్ అంటూ అనిరుధ్ పేర్కొన్నారు.

దేవర థర్డ్ సింగిల్ పై( Devara Third Single ) అంచనాలు పెరిగేలా అనిరుధ్ ట్వీట్ చేయగా వినాయకచవితి పండుగ కానుకగా ఈ సాంగ్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.

సెప్టెంబర్ 6వ తేదీ లేదా 7వ తేదీన ఈ సాంగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

దేవర సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఈ సాంగ్ ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/" / దేవర సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుండగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కథ, కథనం ఏ మాత్రం ఊహించలేని విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర1 సక్సెస్ సాధిస్తే దేవర2 సినిమాపై సైతం అంచనాలు పెరుగుతాయని చెప్పవచ్చు. """/" / అయితే దేవర2 మాత్రం ఇప్పటికే తారక్ ఓకే చెప్పిన సినిమాలు పూర్తయ్యాకే మొదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేవర2 సినిమా యాక్షన్ ప్రియులకు సైతం కచ్చితంగా నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర1 రిజల్ట్ ఆధారంగా దేవర2 మూవీ బడ్జెట్ డిసైడ్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర సీక్వెల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024