బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ గెస్ట్ గా ఎన్టీఆర్… ఇందులో నిజమెంత?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం.

తెలుగులో ఈ కార్యక్రమం ఏడు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధమవుతుంది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ సీజన్ పై అంచనాలను కూడా పెంచేసాయి.

ఇక ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే నాగార్జున( Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. """/" / ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా ఈ కార్యక్రమం లాంచింగ్ ఎపిసోడ్ లో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ సినిమా ప్రమోషన్ల కోసం హాజరవుతూ ఉంటారు.

ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ ప్రారంభపు ఎపిసోడ్లో భాగంగా నాగార్జునతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే సందడి చేయబోతున్నారని సమాచారం.

"""/" / ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా( Devara Movie ) సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బిగ్ బాస్ వేదికపై మరోసారి ఎన్టీఆర్ సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి అనుబంధము ఉంది నిజానికి బిగ్ బాస్ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్  గా వ్యవహరించిన మొదటి సీజన్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక మరోసారి ఎన్టీఆర్ బిగ్ బాస్ వేదికపై కనిపిస్తున్నారనే విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

డబ్బులు ఎవరికి ఊరికే రావు… అనిల్ రావిపూడి కామెంట్స్ ఆయన గురించేనా?