చిన్నప్పుడు ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ చూశారా .. ఎంత అద్భుతంగా వేశాడో.. వీడియో వైరల్!
TeluguStop.com
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా అడుగుపెట్టి నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్( NTR ) ఒకరు.
ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇక సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చిన్నప్పటి ఫోటోలు అలాగే చిన్నప్పుడు ఈయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
గత కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ టీనేజ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా ఈయన టీనేజ్ లో ఉన్న సమయంలోనే స్టేజ్ పై క్లాసికల్ డ్యాన్స్( Classical Dance ) పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది.
"""/" /
ఎన్టీఆర్ తల్లి డాన్స్ టీచర్ కావటంతో ఈయనకు చిన్నప్పటినుంచి కూచిపూడి, భరతనాట్యం వంటి క్లాసికల్ డాన్స్ నేర్పించారు .
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అప్పట్లో ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లను కూడా ఇచ్చారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.
అప్పట్లోనే ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ సైతం ఇరగదీసారు.ఇక ఇప్పుడు కూడా ఈయన డాన్స్ కు ఎవరు సాటిరారు.
ఏ విధమైనటువంటి రిహార్సిల్స్ లేకుండా ఒక్కసారి చూస్తే ఆ స్టెప్పును అదే విధంగా ఎన్టీఆర్ వేస్తారని ఆయనతో డాన్స్ చేయాలి అంటే హీరోయిన్లు బాగా రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దేవర( Devara ) పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది.
భారతదేశంలో భరించలేని పరిస్థితులు.. జపనీస్ టూరిస్ట్ కన్నీటి పర్యంతం!