ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడబోతుంది

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరో గా నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్‌ అయ్యింది.

ఈ నెల 29వ తారీకున ఎన్టీఆర్‌ ముఖ్య అతిధి గా శిల్ప కళా వేదిక లో భారీ ఎత్తున బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

హీరో గా కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న ప్రతి సినిమా ప్రమోషన్ లో ఈమధ్య కాలంలో ఎన్టీఆర్‌ రావడం కామన్ అయ్యింది.

అయితే ఈసారి ఎన్టీఆర్ రావడం పట్ల నందమూరి అభిమానులు చాలా ఆసక్తి గా ఉన్నారు.

కారణం ఏంటీ అంటే ఎన్టీఆర్ యొక్క రీసెంట్‌ లుక్ ను ఈ మద్య ప్రేక్షకులు చూడలేదు.

కారణం ఏంటీ అనేది అందరికి తెల్సిందే కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిజిక్ ను మార్చుతున్నాడు.

షూటింగ్‌ ఆలస్యం అవ్వడం తో అసలు ఎన్టీఆర్‌ ఎలా ఉన్నాడు.ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు అనేది ఆసక్తి గా మారింది.

ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ ప్రమోషన్స్ తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించలేదు.ఆ మద్య విదేశాలకు వెళ్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కాని ఇప్పటి వరకు ఆయన మళ్లీ ఎలాంటి లుక్ ను రివీల్‌ చేయలేదు.

అందుకే ఎన్టీఆర్‌ యొక్క తాజా లుక్ కోసం అభిమానులు ఆసక్తి గా చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎదురు చూపులకు బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఒక ఫుల్‌ స్టాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.

ఎన్టీఆర్‌ మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌ లు కూడా కలిసి ఒక స్టేజ్ మీద కనిపించి చాలా కాలం అయ్యింది.

అందుకే ఎన్టీఆర్ అభిమానులు బింబి సారా ఈవెంట్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.