ఎన్టీఆర్, మహేష్ బాబు డైలాగ్స్ వీడియో.. ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతుందిగా!
TeluguStop.com
మామూలుగా ఒక స్టార్ హీరోకు మాత్రమే అభిమానులు ఉంటారు.అంతేకానీ మరో స్టార్ హీరోకి అంత అభిమానం చూపించరు.
ఒకవేళ చూపించిన అది తమ అభిమాన హీరోకి ఇష్టమైన హీరో ఉంటేనే చూపిస్తారు.
నిజానికి ఒక హీరో ఇంకో హీరోకి మంచి అభిమాన హీరో గానే ఉంటాడు.
కానీ అభిమానుల మధ్యనే తేడాల వల్ల యుద్ధాలు జరుగుతుంటాయి.కానీ హీరో హీరోల మధ్య అలా ఉండదు.
వాళ్ళు ఏ ఈవెంట్ లో కలిసిన కూడా బాగా సరదాగా కలిసిమెలిసి కనిపిస్తూ ఉంటారు.
అలా ఆ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటే తమ అభిమానులు కూడా వెంటనే కలిసిపోతారు.
అలా ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల అభిమానులు కలిసి పోయారు.
ఇటీవలే ఆచార్య సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు కూడా బాగా కలిసిపోయారు.
అలా తమ అభిమాన హీరోలు కలవటంతో ఆ అభిమానులు కూడా ఆ హీరోలకు సంబంధించిన ఫోటోలను కానీ, వీడియోలు కానీ బాగా షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా అలా ఓ ఇద్దరు స్టార్ హీరోల వీడియో కూడా బాగా వైరల్ గా మారింది.
ఇంతకు ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు.ఎన్టీఆర్, మహేష్ బాబు.
"""/"/
గతంలో మహేష్ బాబు కు సంబంధించిన ఓ సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొని తను మహేష్ బాబును అన్న అంటాను అని అన్నాడు.
ఇక ఆ వీడియోతో ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పలు డైలాగ్స్ తో కలిపి ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు.
అందులో మహేష్ బాబుకు, ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సినిమాల డైలాగులు తీసి బాగా ఎడిట్ చేశారు.
"""/"/
ఇక ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకోగా ఆ వీడియోను చూసిన ఆ స్టార్ హీరోల అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.
అంతే కాకుండా కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ఈ స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే.
ఇటీవలే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
"""/"/
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్ ల కాంబినేషన్ లో బిజీగా ఉన్నాడు.
ఇక మహేష్ బాబు డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటించగా ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత మహేష్ బాబు మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్ ల సినిమాలకు కూడా సైన్ చేశాడు.
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.
ఇక మహేష్ బాబు అభిమానులు ఆయనను పాన్ ఇండియా స్టార్ గా చూడటానికి తెగ తాపత్రయ పడుతున్నారు.
కానీ ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు.
షాకిచ్చిన అనితా ఆనంద్ … కెనడా ప్రధాని రేసు నుంచి ఔట్