ఎన్టీఆర్30 రెండో షెడ్యూల్ అప్‌డేట్.. కొరటాల గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనడంలో సందేహం లేదు.
ఆయన ఆర్ఆర్ఆర్( RRR ) చిత్రం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇక తదుపరి సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం లో భారీ బడ్జెట్ లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆ సినిమా కు సంబంధించిన రెండవ షెడ్యూల్ ని ఈ నెల చివరి వారంలో మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరించిన దర్శకుడు కొరటాల శివ రెండవ షెడ్యూల్ లో హీరోయిన్ మరియు హీరో పై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో రెండవ షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ జరగబోతుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
"""/" /
శరవేగంగా ఈ సినిమా ను పూర్తి చేసి హిందీ చిత్రాన్ని మొదలు పెట్టేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు.
కొరటాల శివకు ఇప్పటికే సెప్టెంబర్ వరకు సినిమాను పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన షూటింగ్ ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చక చకా పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.
అందుకే మొదటి షెడ్యూల్ పూర్తయిన రెండు వారాల్లోనే రెండో షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
మొత్తానికి ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే చాలా స్పెషల్ గా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక ఈ సినిమా మరో విజయాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.అయితే జక్కన్న సినిమా లో నటించి ఆ తర్వాత నటించే సినిమా లు ఫ్లాప్ అవుతాయి.
కనుక ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.