ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని భయపెడుతున్న ‘దేవర’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌( Young Tiger Ntr ) హీరోగా కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి దేవర( DEVARA Movie ) అనే టైటిల్‌ ని ఖరారు చేయడం జరిగింది.

నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు( NTR Birthday ) సందర్భంగా దేవర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

హీరోగా ఆర్‌ఆర్ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా స్థాయి స్టార్‌ డమ్‌ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ అంతర్జాతీయ స్థాయి లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

"""/" / కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఆచార్య నిరాశ పర్చింది.

దాంతో దేవర విషయంలో మొదటి నుండి కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ తో గతంలో ఈయన రూపొందించిన జనతా గ్యారేజ్ పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది కానీ కమర్షియల్‌ గా ఆశించిన స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలం అయ్యింది.

"""/" / ఎట్టకేలకు దేవర సినిమా తో మళ్లీ వీరిద్దరి కాంబో రాబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఫస్ట్‌ లుక్( First Look ) వచ్చింది.

ఈ ఫస్ట్‌ లుక్ ని చూసి కొందరు సోషల్‌ మీడియాలో ఆ మధ్య కన్నడంలో వచ్చిన ఒక సూపర్‌ హిట్‌ సినిమా లుక్‌ ని చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాపీ కొట్టాడా లేదంటే రీమేక్ అయ్యి ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్టీఆర్‌ అభిమానులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దేవర సినిమా యొక్క ఫస్ట్‌ లుక్‌ విడుదల అయిన తర్వాత సినిమా పై కొందరికి అంచనాలు పెరిగితే మరి కొందరు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సినిమా యొక్క ఫలితం ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అశ్విన్ CSKలోకి తిరిగి రావడంపై అసలు విషయం ఇదే!