‘దేవర’ బడ్జెట్ లో 100 కోట్లు దానికోసమేనట.. ఇదే నిజమైతే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''దేవర''.

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా ఈ లుక్స్ తో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

"""/" / ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా కంటే ముందు ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ సినిమాతో తన మార్కెట్ భారీ స్థాయిలో పెంచుకున్న తారక్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు.

దీంతో ఈ సినిమాకు బడ్జెట్ భారీ స్థాయిలో పెడుతున్నట్టు టాక్. """/" / ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నారు.

అంతా భారీ కాస్టింగ్ కావడంతో ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అని తెలుస్తుంది.

మరి ఇందులో 100 కోట్ల వరకు విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్టు టాక్.

ఇదే నిజమైతే ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు చాలా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.

సముద్ర నేపథ్యంలో జరగనున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే భారీ సి సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు.

కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )నటిస్తుండగా.

విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీయార్ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తారా..?