ఆ నిర్మాతకు త్రివిక్రమ్ ను తెచ్చుకో అంటూ సలహా ఇచ్చిన ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటువంటి దర్శకులతో సినిమా చేయాలని హీరోలు అనుకుంటూ ఉంటారు.త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపించినప్పటికీ ఆ సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందె.

కారణం ఏంటి అన్న తెలియదు కానీ వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆగిపోయింది.

కానీ వారిద్దరి మధ్య బాండింగ్ మాత్రం అలాగే ఉంది.కానీ త్రివిక్రమ్, ఎన్టీఆర్ కు మధ్య మాటలేవు అంటూ పలు రకాల ప్రచారాలు కొనసాగిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మళ్ళీ ఒకటి అయ్యేలాగా కనిపిస్తోంది.

అసలేం జరిగిందంటే.ఇటీవల టాలీవుడ్ కి చెందిన ఒక పెద్ద నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎప్పటినుంచో సదర నిర్మాతకు ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరిగింది.ఎన్నోసార్లు వాళ్ల బంధం కలపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదు.

ఇటువంటి నేపథ్యంలో సదరు నిర్మాత ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ఒక సినిమాను చేయాలని కోరారట.

ఆ నిర్మాత అడిగిన విషయంపై జూనియర్ ఎన్టీఆర్ బదిలీస్తూ అలాగే చేద్దాం.దర్శకుడు త్రివిక్రమ్ ని తెచ్చుకో అని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ ఆ మాట చెప్పగానే సదురు నిర్మాత ఒక్కసారిగా షాక్ అయ్యాడట.

"""/"/ ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం హారిక సంస్థకే సినిమాలు చేస్తారు.అయినప్పటికీ సదరు నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం వివరించడంతో ఈ త్రివిక్రమ్ ఓ తప్పకుండా అలాగే అని చెప్పి ఆ నిర్మాతనే పంపించేశారట.

మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ తో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి అని తెలుస్తోంది.

ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు.

పేదల కోసం టిమ్స్ ఆసుపత్రులు నిర్మించిన కేసీఆర్:కేటీఆర్