ఎన్టీఆర్ 30 కీలక అప్‌డేట్ వచ్చేసింది
TeluguStop.com
అల వైకుంఠపురంలో చిత్రంతో మొన్న సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ చిత్రం విషయంలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక ఈ చిత్రంకు సంగీత దర్శకుడిగా థమన్‌ను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బన్నీ అల వైకుంఠపురంలో చిత్రం అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన కారణం పాటలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుండే థమన్ పాటలతో మారు మ్రోగించాడు.
సామజవరగమనా, బుట్టబొమ్మ ఇలా అన్ని పాటలు కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా బన్నీ కూడా థమన్‌కు సక్సెస్ క్రెడిట్ ఇచ్చారు. """/"/అల వైకుంఠపురంలో సక్సెస్‌తో థమన్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.
ప్రస్తుతం ఆయనకు ఉన్న డిమాండ్ మరే సంగీత దర్శకుడికి లేదు.అందుకే ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా థమన్‌నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారట.
ఇప్పటికే ఒకటి రెండు పాటల ట్యూన్ కూడా అయ్యినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌తో బిజీగా ఉన్నాడు.
జూన్ లేదా జులై నుండి సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదల చేస్తామంటూ త్రివిక్రమ్ ఇప్పటికే ప్రకటించాడు.
ఎన్టీఆర్ 30కి థమన్ సంగీతం అందించనుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!