”NTR30” షూట్ అప్డేట్.. ఫైట్ సీక్వెన్స్ తో రేపటి నుండి స్టార్ట్!
TeluguStop.com
తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో కూడా డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''NTR30''.
ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.
మరి ఇప్పటికే ఈ సినిమా లాంచింగ్ కోసమే చాలా సమయం వెయిట్ చేయించారు.
అందుకే ఈసారి సినిమా షూట్ (NTR30 Shoot) ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
"""/" /
ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలను పెంచుకున్న ఈ సినిమా రేపటి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ అవ్వబోతున్నట్టు టాక్ వస్తుంది.
ఈ సినిమాలో హాలీవుడ్ ప్రముఖ సాంకేతిక నిపుణులను భాగం చేయడంతో విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ భారీగా ఉంటాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
మరి అంతా అనుకున్న విషంగా ఈ సినిమా ఫైట్ సీక్వెన్స్ తోనే రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది.
మొత్తానికి ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఫలితం వచ్చేస్తుంది. """/" /
మరి ఈ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పరిజ్ఞానం మన తెలుగు సినిమాకు ఎంత వరకు ఉపయోగ పడుతుందో కొరటాల ఈ సినిమాలో విజువల్స్ ను ఏ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారో వేచి చూడాల్సిందే.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది.అయితే ఇప్పుడు పాన్ ఇండియా కావడంతో సర్వత్రా ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు.
చూడాలి కొరటాల ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటారో.
స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?