ఎన్టీఆర్‌ 30 : జూన్‌ పోయి జులై వచ్చే ఇదేం విడ్డూరం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా కు దాదాపుగా నాలుగు సంవత్సరాల సమయం కేటాయించాడు.

ఆ సినిమా నాలుగేళ్ల కష్టం కు ప్రతిఫలం ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రికార్డు స్థాయిలో ఆ సినిమా వసూళ్లు సాధించడంతో తదుపరి సినిమా విషయంలో ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఉన్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

ఇప్పటికే ఎన్టీఆర్‌ 30 కి కొరటాల శివ దర్శకత్వం అనే విషయం క్లారిటీ వచ్చేసింది.

సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ ఎన్టీఆర్‌ 30 ని తెరకెక్కిస్తాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

కాని ఆచార్య సినిమా ఫలితం నేపథ్యంలో కొరటాల శివ పై కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒక సినిమా ప్లాప్ అయితే తదుపరి సినిమా ప్లాప్ అవ్వాలని ఏమీ లేదు.

కనుక కొందరు ఎన్టీఆర్‌ అభిమానులు అనుమానం లేకుండా ఎన్టీఆర్‌ 30 కోసం ఎదురు చూస్తున్నారు.

సినిమా ను మొదట జూన్‌ నెలలో ప్రారంభిస్తామన్నారు.ఆచార్య ప్లాప్‌ వల్ల నో మరేంటో కారణం కాని ఇప్పుడు జులైకి సినిమా ను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి.

సినిమాను జులైలో ప్రాంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్ సినిమా కు చాలా సమయం కేటాయించాడు.కనుక ఇక నుండి మూడు నాలుగు నెలలకు ఒక సినిమా చొప్పున పూర్తి చేసి ఆర్ ఆర్‌ ఆర్‌ వల్ల ఏర్పడిన గ్యాప్ ను ఫిల్‌ చేయాలని భావిస్తున్నాడట.

కాని కొరటాల శివ టైమ్‌ మీద టైమ్ కావాలంటూ గ్యాప్ తీసుకుంటూ ఉంటే మరీ ఆలస్యం అవుతూ ఉంది.

కనీసం జులై లో అయినా ప్రారంభం అయ్యేనా.మళ్లీ ఆగస్టు కు వాయిదా పడేనా అనేది చూడాలి.

వీడియో వైరల్.. భార్యతో కలిసి రెచ్చిపోయిన ట్రంప్