ఎన్ఎస్పి కాలువ ఆధునీకీకరణలో డొల్లతనం…!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆధునీకీకరణ పనులు ఇలాగే కొనసాగితే చివరి ఆయకట్టుకు నిరందడం కష్టమేనని ప్రజా సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు.

ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎంబీసీ బ్లాక్ 13 లైనింగ్ అభివృద్ధి పనుల్లో డొల్లతనం కనిపిస్తుందని,నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాల నేతలు పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మునగాల హెడ్ రెగ్యులేటరీ నుంచి చింత్రియాల మేజర్ వరకు సుమారు 29 కి.

మీ.మేర లైనింగ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ184.

60 కోట్లు మంజూరు చేసింది.2022 మే 25న పనులు ప్రారంభించి 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నాణ్యత లేకపోవడం వలన కాలువ సైడ్ వాల్స్ లైనింగ్ అడుగు భాగం మరియు కాలువకట్ట త్వరగా శిథిలమై ప్రజాధనం దుర్వినియోగమయ్యే పరిస్థితి వస్తుందన్నారు.

నాణ్యత లోపం వల్ల కాలువ చివర రైతుల పొలాలకు నీరు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం వాడాల్సిన ఇసుక,కంకర సిమెంట్ సరైన నిష్పత్తిలో వాడడం లేదని,సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని,కాంట్రాక్టర్లతో కుమ్మైకై పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు.

కాలువ లైనింగ్ పనుల నుండి తగిన శాంపిల్స్ సేకరించి ల్యాబ్లో టెస్ట్ చేసి నాణ్యత లేనట్లయితే కాంట్రాక్టర్ ను తొలగించి సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లేనిపక్షంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ను,సాగునీరు పారుదల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 5 ఏళ్ల బాలుడిపై కోతుల దాడి.. వీడియో వైరల్