రక్షణ గోడ లేకుండా ప్రమాదకరంగా ఎన్ఎస్పి టన్నెల్..!

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారి పక్కనే ఎన్నో ఏళ్లుగా ఎన్ఎస్పి కాల్వ అండర్ టన్నెల్ రక్షణ గోడ కూలిపోయి ప్రమాదకరంగా మారింది.

ఎన్నో ఏళ్ల తరబడి శిథిలావస్థ చేరుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముప్పారం నుండి ముచంపల్లి వరకు నూతన బీటీ రోడ్డు మంజూరై 70% వరకు పూర్తయిందని, కానీ, ముప్పారం నుండి నిడమనూరుకు ప్రయాణించే వాహదారులు స్పీడుగా వస్తుండడంతో యూటీ దగ్గర మూలమలుపు ఉండడంతో రక్షణ కూడా లేకపోవడం వలన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి రక్షణ గోడ నిర్మించి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరుతున్నారు.

భారతీయుడు2 సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. భోలేషావలి కామెంట్స్ వైరల్!