ఎన్ఎస్పీ కెనాల్ కట్టకి పొంచి ఉన్న ప్రమాదం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రం గుండా ప్రవహించే సాగర్ ఎడమ కాలువకు మునగాల కృష్ణానగర్( Munagala Krishnanagar ) మధ్యలో కట్ట తెగి ప్రమాదకర స్థితికి చేరుకుంది.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేయకపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎన్ఎస్పీ అధికారులకు కనిపించడం లేడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీటి విడుదల జరిగితే కట్ట తెగే అవకాశం ఉందని, తద్వారా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
ప్రధాన కాలువ కట్ట తెగినా కనీసం పర్యవేక్షణ చేయకుండా ఎన్ఎస్పీ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై
మండిపడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టకు మరమ్మత్తు చర్యలు చేపట్టి జరగబోయే ప్రమాదాన్ని ముందే అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
బాలయ్య బాబు ప్రయోగత్మాకమైన సినిమాలు చేయలేడా..?