బాబు మరింత ' భద్రం ' ! కొత్త కమాండోలు ఎంతమందంటే ?
TeluguStop.com
ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఆయనపై భౌతిక దాడులూ అనేకం జరుగుతూనే ఉన్నాయి.ముఖ్యంగా వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతూ, అనేకమార్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
అయినా పెద్దగా ప్రయోజనం అయితే కనిపించ లేదు.ఇదిలా ఉంటే ఏపీలో చోటు చేసుకుంటున్న ఈ దాడులు వ్యవహారంపై ఎన్ ఎస్ జి తాజాగా రివ్యూ చేసింది.
చంద్రబాబుకు ప్రస్తుతం ఇస్తున్న భద్రత ఏమాత్రం సరిపోదని భావించి మరో 20 మంది కమాండోలతో భద్రతను పెంచింది.
ఇప్పటివరకు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి నిబంధనల ప్రకారం షిఫ్ట్ కు ఎనిమిది మంది చొప్పున భద్రతను కల్పించేవారు .
అయితే ఇప్పుడు వారి సంఖ్యను మరో 20 మందికి పెంచారు.
అంతేకాకుండా ఇప్పటివరకు డిఎస్పి ర్యాంక్ అధికారి పర్యవేక్షణలో చంద్రబాబు భద్రతను పర్యవేక్షించేవారు.
అయితే ఇక నుంచి డిఐజి స్థాయి అధికారి చంద్రబాబు భద్రతను పర్యవేక్షించనున్నారు.చంద్రబాబుకు ముప్పు ఉందని ఖచ్చితమైన సమాచారం తోనే రంగంలోకి దిగినట్లు సమాచారం .
ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉండడం , భౌతిక దాడుల వరకు వ్యవహారం వెళ్తుండడంతోనే ఈ భద్రతా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
"""/"/
గతంలో అనేకసార్లు చంద్రబాబుపై వైసీపీకి చెందిన నాయకులు దాడికి దిగిన సంఘటనలు జరిగినా, పోలీసులు అంతగా ఆ వ్యవహారాలను పట్టించుకోకపోవడం, నిన్న కుప్పంలో జరిగిన సంఘటనలు రాబోయే రోజుల్లో మరింత ముప్పు చంద్రబాబుకు ఉందనే నివేదికలు వీటన్నిటిని పరిశీలించిన మీదటే ఎన్ ఎస్ జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
వాస్తవంగా కేంద్రం నిర్ణయం ప్రకారమో, ఫిర్యాదులు, విజ్ఞప్తులు మేరకు ఎన్ఎస్ జి ఈ రకమైన భద్రత ఏర్పాట్లు చేయదు.
సొంత నివేదికలు, దర్యాప్తు ఆధారంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది .ఇప్పుడు చంద్రబాబుకు పెరిగిన అదనపు భద్రతతో ఆయన మరింత భద్రంగా ఉండే అవకాశం లభించడంపై టిడిపి శ్రేణులుఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?