ఆస్ట్రేలియా లో ఎన్నారైల “రస రాగ సుధా”

భారతీయులు అందులోనూ తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు జాతి సంస్కృతీ సాంప్రదాయాలని ఎన్నడూ మర్చిపోలేదు ఎదో ఒక పండుగ రోజునో ఎదో ఒక మంచి రోజున అందరూ కలిసి తెలుగు కీర్తిని మననం చేసుకుంటూనే ఉంటారు.

తెలుగు బాషని మర్చిపోకుండా తమ భావితరాలకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మెల్బోర్న్ లో ఉన్న ప్రవాసులు తెలుగు భాష, సాహిత్యం ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు ‘రసరాగ సుధ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా హాస్య నటుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ముఖ్య అతిదిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రవాసులని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ సందర్భంగా భాగవతంలోని కొన్ని పద్యాలు, గుఱ్ఱం జాషువా భావజాలం, శ్రీశ్రీ కవితా వికాసం అద్భుతంగా వివరించారు.

అనంతరం తెలుగు సంఘం ప్రతినిధులు బ్రహ్మానందానికి “హాస్య రస బ్రహ్మ” అన్న బిరుదునిచ్చి సత్కరించింది.

!--nextpage ఇదే కార్యక్రమానికి మరొక అతిధిగా కళారత్న మీగడ రామలింగ స్వామి కూడా హాజరయ్యారు.

‘నవావధానం’తో ఆయన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది పృచ్ఛకులు పాల్గొని వివిధ భాగాల్లో పద్యాలు, కీర్తనలు, పాటలు పాడితే.

నవావధానిగా మీగడ ఇతర రాగాల్లో వాటిని పాడి వినిపించారు.అంతే కాకుండా తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు.

అయితే మొదటి సారిగా మెల్బోర్న్ లో జరిగిన ఈ తెలుగు మహా సభలకి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీని కట్ట.

దేశ విదేశాలలో ఉన్నా సరే తెలుగు బాషని తెలుగు ని బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యం ఉన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బ్రహ్మానందం.

ప్రతీ ఏటా ఇదేవిధంగా ఈ తెలుగు మహా సభలు నిర్వహిస్తామని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు.

వాస్తును గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది మరి.. (వీడియో)