ఎన్నారై స్టూడెంట్ సంచలనం.. భారతీయులకంటే హోంలెస్ వాళ్లకే ఎక్కువ మర్యాద ఉంటుందట!

అమెరికాలో పుట్టి పెరిగిన ఓ ఎన్నారై స్టూడెంట్ ( NRI Student )చదువుల కోసం ఇండియా వచ్చాడు.

ఇక్కడి పరిస్థితులు చూసి షాకయ్యాడు.తన అనుభవాలను రెడిట్‌లో రాసుకొచ్చాడు.

అది కాస్తా వైరల్ అయిపోయింది.ఇండియాలో సివిక్ సెన్స్ లేదని, మనుషులు మనుషుల్లా ఉండటం లేదని కామెంట్ చేశాడు.

ఒక సంవత్సరం ఇండియాలో ఉన్న ఆ స్టూడెంట్ తన మనసులోని మాటల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

"ఇక్కడ చాలా మందికి కనీసం మర్యాద కూడా తెలీదు.అమెరికాలో మురికివాడల్లో ఉండే నిరాశ్రయులు కూడా వీళ్లకంటే బెటర్" అని ఘాటుగా విమర్శించాడు.

ఇంకా ఏమన్నాడంటే."ఇండియాలో అందరూ ఎప్పుడూ పరుగులే పెడుతున్నారు.

ఎవ్వరికీ చిన్న సంతోషాల్ని ఆస్వాదించే టైం లేదు.జనాభా ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ అందుకే ఇలా తయారయ్యారు" అని బాధపడ్డాడు.

పిల్లలు కూడా చదువుతున్నారని, కానీ దేనికోసం చదువుతున్నారో వాళ్లకే తెలీదని అన్నాడు.దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది అంటున్నారు కానీ కాలేజీల్లో కనీసం మంచి వసతులు కూడా లేవని నిరాశ చెందాడు.

రోడ్లు, బిల్డింగులు అన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని ఫైర్ అయ్యాడు. """/" / కరప్షన్ ( Corruption )గురించి మాట్లాడుతూ.

"ఇక్కడ చాలా మంది లంచగొండితనాన్ని సాధారణంగా తీసుకుంటున్నారు.నన్ను కూడా అలాగే ఉండమని చెప్తున్నారు.

కరప్షన్ పోయేంత వరకు ఈ దేశం బాగుపడదు" అని తేల్చి చెప్పాడు.నిజాయితీ, నీతి నిజాయితీలకు ఇక్కడ విలువ లేదని కుండబద్దలు కొట్టాడు.

సామాన్యులంతా కలిసికట్టుగా వస్తేనే మార్పు వస్తుందని ఆ స్టూడెంట్ అభిప్రాయపడ్డాడు.కానీ అతని కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

కొందరు అతనికి సపోర్ట్ చేస్తే, మరికొందరు మాత్రం అతన్ని ట్రోల్ చేశారు. """/" / ఒక నెటిజన్ ఏమన్నాడంటే.

"అమెరికాతో ఇండియాని పోల్చడం కరెక్ట్ కాదు.వేరే డెవలపింగ్ కంట్రీస్‌తో పోల్చుకోండి" అని సలహా ఇచ్చాడు.

ఇంకొకరేమో."ఇండియా పేద దేశం, జనాభా ఎక్కువ.

ఇది 2BHK ఫ్లాట్‌లో 100 మంది ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది" అని కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇంకొక యూజర్ మాత్రం స్టూడెంట్‌కి సపోర్ట్ చేస్తూ, "నేను కూడా వేరే దేశం వెళ్లినప్పుడు క్లీన్‌నెస్‌లో, సివిక్ సెన్స్‌లో చాలా తేడా చూశాను" అని కామెంట్ పెట్టాడు.

ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.ఎవరి వాదనలు వాళ్లు బలంగా వినిపిస్తున్నారు.

ఈ డిబేట్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.