రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నారై సూసైడ్.. ఆర్థిక ఇబ్బందులే కారణమా…

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది.ఈ ప్రాంతంలో ఒక ఎన్నారై ( NRI ) సూసైడ్ చేసుకున్నాడు.

నాలుగు నెలల కిందట ఆస్ట్రేలియా దేశం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆ ఎన్నారై అనూహ్యంగా ప్రాణాలను తీసుకుని కుటుంబ సభ్యులను శోక సంద్రంలో నెట్టేశాడు.

వివరాల్లోకి వెళ్తే, 46 ఏళ్ల విష్ణువర్ధన్‌ రెడ్డి( Vishnuvardhan Reddy ) స్వస్థలం గుంటూరు జిల్లా.

ఇంతకుముందు ఆస్ట్రేలియా కి వెళ్లి కొన్ని రోజులు నివసించాడు.ఆస్ట్రేలియా ( Australia ) నుంచి ఇండియాకు వచ్చాక మై హోం భుజా డీ బ్లాక్ 1401 ప్లాట్‌లో (46) స్టే చేశాడు.

అంతా బాగుందనుకున్న సమయంలోనే విష్ణువర్ధన్‌రెడ్డి తన ఫ్లాట్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

"""/" / అతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు కచ్చితంగా తెలియ రాలేదు కానీ ఆర్థిక ఇబ్బందులు, వివాహం కాకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు( Rayadurgam Police ) కేసు ఫైల్ చేశారు.

ఈ సూసైడ్ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. """/" / జీవితంలో వచ్చే అన్ని సమస్యలు కూడా తాత్కాలికమైనవే.

పట్టుదల, సంకల్పం, విశ్వాసం ఉంటే బతికి సాధించవచ్చు.నిస్సహాయతలో ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వారిని సాయం కోరి జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు.

కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా బాధల్లో ఉన్నట్లు అనిపిస్తే ఓపెన్ గా మాట్లాడుతూ వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలాంటి బాధలు పడుతున్నారో తెలుసుకోవాలి.

ఆపై వారిలో ధైర్యాన్ని నింపాలి.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గొర్రె పురాణం మూవీ.. ఇక్కడైనా హిట్ గా నిలుస్తుందా?