భారతీయుడికి తొమ్మిదేళ్ళ శిక్ష..!!

అమెరికా కోర్టు అమెరికాలో నివసిస్తున్న భారతీయుడికి తొమ్మిదేళ్ళ శిక్షని ఖరారు చేస్తూ సంచలన తీర్పుని వెల్లడించింది.

ఓ మహిళపై లైంఘిక దాడికి పాలపడ్డాడు అనే కారణంతో కోర్టు ఈ తీర్పుని వెల్లడించింది.

వివరాలలోకి వెళ్తే.గతంలో తమిళనాడుకి చెందిన ప్రభు రామమూర్తి అనే వ్యక్తి అమెరికాలో టెకీగా పని చేస్తున్నాడు.

అయితే కొంత కాలం క్రితం తను ఓ విమానంలో Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తోటి మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు ఈ విషయం అందరికి తెలిసిందే.

ఆ సమయంలో అతడిపై కేసు నమోదు అయ్యింది కూడా.లాస్ వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న విమానంలో పక్క సీటులోని 23 ఏళ్ల యువతితో అసభ్యంగాప్రవరించాడు అనే కారణంతో.

ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఆ మహిళ అందుకు తగ్గట్టుగా సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సమర్పించడంతో డెట్రాయిట్ ఫెడరల్ కోర్టు అతనికి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరికి స్వేచ్చగా ప్రయాణించే హక్కు ఉంటుందని తోటి మహిళా ప్రయాణికురాలితో నిందితుడు ప్రవర్తించిన తీరు సరైనది కాదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

అబ్బా ఏం తెలివి.. ముంబై పోలీసు పరీక్షలో చిరంజీవి స్టైల్‌లో మోసం..!