ఎన్నారైలకి మరో కొత్త చిక్కొచ్చి పడిందిగా..!!

మాంచి ఆకలితో ఉన్న వాడికి నోటి దాకా అన్నం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి.

ఇప్పుడు అమెరికాలోని ఎన్నారైల పరిస్థితి కూడా అలానే ఉంది.కరోనా కారణంగా భారత్ వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసిన విషయం విధితమే.

ఈ మిషన్ లో భాగంగా భారతీయులని ఇండియా కి తీసుకువెళ్ళే ప్రయంతం చేస్తోంది.

ఈ క్రమంలో ఇండియా రావాలని ఆరాటపడుతున్న లక్షలాది మంది భారతీయులు సొంత ప్రాంతాలకి చేరుకోబోతున్నారు.

ఇప్పటికే కొందరు ఇండియా వెళ్ళిపోయారు.అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా కేంద్రం నెలరోజుల క్రితం విధించిన నిభంధాన కారణంగా కొందరు ఎన్నారైలు మాత్రం భారత్ వెళ్ళలేక పోయారు.

ఎంతో నిరుత్సాహంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.నెల రోజుల క్రితం భారత్ ప్రభుత్వం కరోనా సందర్భంగా ఓసిఐ కార్డులు కలిగిన ఎన్నారైలపై నిషేధం విధించింది.

అంటే అమెరికాలో ఉంటూ శాశ్వత నివాసం హక్కు పొందిన వారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఈ నిభందన వర్తిస్తుంది.

"""/"/ అమెరికాలో ఎవరైనా పుడితే వారికి అక్కడి హక్కుల ప్రకారం శాశ్వత హోదా కలుగుతుంది.

ఈ క్రమంలో ఎంతో మంది భారత ఎన్నారైల పిల్లలు అమెరికా పౌరసత్వాన్ని కలిగిఉన్నారు.

ఈ క్రమంలోనే కేంద్రం ఏర్పాటు చేసిన విమాన కేంద్రాలకి భారత్ రావడానికి వెళ్ళిన సమయంలో వారి పిల్లలకి ఓసీఐ కార్డులు ఉండటంతో తల్లి తండ్రులకి అనుమతులు ఉన్నా పిల్లలకి మాత్రం అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు దాంతో పిల్లలని వదిలి వెళ్ళలేక తల్లి తండ్రులు సైతం పిల్లలతో వెనుతిరుగుతున్నారు.

వావ్, రాకెట్ బిల్డ్ చేయడానికి పెద్ద కోడ్ రాసిన 11 ఏళ్ల బాలుడు..