నాడు పొట్ట చేత పట్టుకుని అమెరికాకి.. నేడు కంపెనీకి అధినేత, ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ

18వ ప్రవాసీ భారతీయ దివస్ ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఘనంగా జరుగుతోంది.శుక్రవారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.

ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టినా క్లారా ( Christina Clara )హాజరైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమెను ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు భువనేశ్వర్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన ఒడిషాకు చెందిన వ్యాపారవేత్త ధీరేంద్ర కర్ ( Businessman Dhirendra Kar )తన అనుభవాలను పంచుకున్నారు.

మెరుగైన జీవితం, అవకాశాల కోసం తాను దశాభ్ధాల క్రితం స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / జాజ్‌పూర్ జిల్లాలోని ఘోలాపూర్( Gholapur In Jajpur District ) గ్రామానికి చెందిన కర్ 27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో విజయం సాధించడంతో పాటు ఒడిషా ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

దాదాపు 200 మందికి పైగా ఒడియా యువతకు ఉపాధి కల్పించినట్లు కర్ వెల్లడించారు.

అమెరికాలో తాను ఐటీ ప్రొఫెషనల్‌గా జీవితాన్ని ప్రారంభించానని.తర్వాత సొంతంగా కంపెనీ పెట్టే స్థాయికి చేరుకున్నట్లు కర్ పేర్కొన్నారు.

దీని ద్వారా 200 మందికి పైగా ఒడిషాకు చెందిన యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు ధీరేంద్ర చెప్పారు.

నా జన్మభూమి అభివృద్ధికి తోడ్పడటం , 200 మంది యువతకు ఉపాధి కల్పించడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన తెలిపారు.

"""/" / భువనేశ్వర్‌లో వేగవంతమైన ఆర్ధిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నప్పటికీ.ప్రపంచ వేదికపై పోటీ పడటానికి ప్రభుత్వ మద్ధతు చాలా ముఖ్యమని ధీరేంద్ర ( Dhirendr )అన్నారు.

ఇదే సమయంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు.

పరిశ్రమల అభివృద్ది, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి నవీన్ తగినంత చొరవ చూపించలేని ఆయన ఆరోపించారు.

కాలువలో భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు.. వీడియో చూస్తే గుండె ఆగుద్ది!