10 నిమిషాల ప్రయాణానికి రూ. 2800 ఛార్జ్ .. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో వెలుగులోకి , ట్యాక్సీవాలా అరెస్ట్

విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు మనదేశానికి వచ్చే ప్రవాస భారతీయులు.( NRI's ) ఇండియా డెవలప్‌మెంట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటారు.

మరికొందరైతే ఇక్కడ జనంలో మార్పు రాలేదని.దోపిడీ అలాగే కొనసాగుతోందని బాధపడుతుంటారు.

తాజాగా ముంబైలో( Mumbai ) 10 నిమిషాల డ్రైవ్ కోసం ఎన్ఆర్ఐ నుంచి రూ.

2,800 వసూలు చేసిన ఓ టాక్సీ డ్రైవర్‌ను( Taxi Driver ) పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రవాస భారతీయుడు నగరంలోని విలే పార్లే ప్రాంతానికి 10 నిమిషాలు ఓ ట్యాక్సీలో ప్రయాణీంచినందుకు గాను రూ.

2,800 చెల్లించాడు.డిసెంబర్ 15న డి.

విజయ్( D.Vijay ) అనే నాగపూర్‌కు( Nagpur ) చెందిన ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా నుంచి ముంబై విమానాశ్రయానికి( Mumbai Airport ) అర్ధరాత్రి పూట చేరుకున్నట్లు సహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

"""/" / విజయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వచ్చిన వెంటనే క్యాబ్ డ్రైవర్ వినోద్ గోస్వామి ఆయన వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగ్గా.

ఆయన విల్ పార్లే ప్రాంతానికి వెళ్లాలని చెప్పాడు.అయితే విజయ్‌కి నకిలీ యాప్‌ను చూపించిన గోస్వామి హోటల్ వద్దకు చేరుకున్న వెంటనే రూ.

2,800 ఛార్జీ అయినట్లుగా చెప్పి పేమెంట్ తీసుకున్నాడు.అయితే ఎక్కడో ఏదో తేడా జరిగిందని అనుమానించిన విజయ్.

వెంటనే తాను బస చేస్తున్న హోటల్ సిబ్బందిని ఆరా తీశాడు.తాము ఒక పికప్ సర్వీస్‌కు రూ.

700 ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు.దీంతో తాను మోసపోయినట్లుగా గ్రహించిన విజయ్.

వెంటనే క్యాబ్ డ్రైవర్ మొబైల్ నెంబర్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదును మెయిల్ చేశాడు.

"""/" / దీని ఆధారంగా 12 గంటల్లోగా గోస్వామిని ట్రాక్ చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు .మఫ్టీలో సిబ్బందిని మోహరించి ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 9 మంది క్యాబ్ డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు.