అమితాబ్‌పై అభిమానం చాటుకున్న ఎన్ఆర్ఐ.. ఏకంగా ఇంటి ముందే బిగ్‌బీ విగ్రహం, ఖర్చు ఎంతో తెలుసా..?

భారతదేశ సినీరంగంలో ఎందరో నటులు.కానీ కొందరు మాత్రం అరుదు.

వయసు మీద పడుతున్నా.వీరిపై జనం అభిమానం రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు.

అంతేకాదు.ఏ తరాన్ని అయినా మెప్పించగల సత్తా వారి సొంతం.

అలాంటి వారిలో ముందు వరుసలో వుంటారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.80వ పడిలో వున్నా.

నేటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.వయసు పెరుగుతున్నప్పటికీ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా యువతరానికి పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు బిగ్‌బీ.

దేశంలోని మూడు తరాల వారికి ఆయనే ఫేవరేట్ యాక్టర్.ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు ఓ ఎన్ఆర్ఐ.

ఏకంగా ఇంటి ముందు బిగ్‌బీ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.వివరాల్లోకి వెళితే.

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ సిటీలో స్థిరపడిన గోపీ సేథ్ అనే ప్రవాస భారతీయుడు అక్కడ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ఆయనకు చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ అంటే వల్లమాలిన అభిమానం.గోపీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా అంతే.

ఈ నేపథ్యంలో గోపీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.తన ఇంటి ముందే అమితాబ్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.

"""/"/ ఈ కార్యక్రమాన్ని కూడా ఆషామాషీగా నిర్వహించలేదు.తన మిత్రులు, స్థానికులను ఆహ్వానించి.

బాణాసంచా కాలుస్తూ బిగ్‌బీ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా గోపీ సేథ్ మాట్లాడుతూ.30 ఏళ్ల క్రితం న్యూజెర్సీలో నవరాత్రి ఉత్సవాల సమయంలో అమితాబ్ బచ్చన్‌ను తొలిసారి కలిసినట్లు తెలిపాడు.

ఆయన మాట్లాడే విధానం, వ్యక్తిత్వం తనకు ఎంతో నచ్చుతాయని.జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ అమితాబ్ ఒదిగే వుంటారని గోపీ ప్రశంసించారు.

పుష్ప3 మూవీ టైటిల్ ఇదే.. ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారుగా!