రాజ్‌కోట్ అగ్నిప్రమాదం : ఎన్ఆర్ఐ జంట సజీవదహనం .. కొద్దిరోజుల క్రితమే పెళ్లి , అంతలోనే

రాజ్‌కోట్ అగ్నిప్రమాదం : ఎన్ఆర్ఐ జంట సజీవదహనం కొద్దిరోజుల క్రితమే పెళ్లి , అంతలోనే

గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌‌లోని( Rajkot ) టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో( TRP Game Zone ) శనివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో( Fire Accident ) 33 మంది సజీవ దహనమవ్వగా .

రాజ్‌కోట్ అగ్నిప్రమాదం : ఎన్ఆర్ఐ జంట సజీవదహనం కొద్దిరోజుల క్రితమే పెళ్లి , అంతలోనే

వీరిలో 9 మంది చిన్నారులు కావడం దురదృష్టకరం.అలాగే మరో 26 మందికి పైగా ప్రమాదంలో గల్లంతయ్యారు.

రాజ్‌కోట్ అగ్నిప్రమాదం : ఎన్ఆర్ఐ జంట సజీవదహనం కొద్దిరోజుల క్రితమే పెళ్లి , అంతలోనే

దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదానికి సంబంధించి ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వాటిని డీఎన్ఏ పరీక్షకు పంపనున్నారు అధికారులు.

మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

అలాగే క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని సర్కార్ తెలిపింది.

"""/" / ఇదిలావుండగా .అగ్నిప్రమాదంలో కెనడాకు( Canada ) చెందిన ఎన్ఆర్ఐ యువకుడు, అతని భార్య, ఆమె సోదరి దుర్మరణం పాలవ్వడం కంటతడి పెట్టిస్తోంది.

వీరు ఇటీవలే వారి వివాహ వేడుకలను జరుపుకునేందుకు రాజ్‌కోట్‌కు వచ్చారు.మృతులను అక్షర్ కిషోర్‌భాయ్ ధోలారియా ,( Akshar Kishorbhai Dholaria ) అతని భార్య ఖ్యాతి సవలియా,( Khyaati Savaliya ) ఆమె సోదరి హరితా సవలియాలుగా( Harita Savaliya ) గుర్తించారు.

ప్రమాదం జరగడానికి ముందు ముగ్గురు కలిసి టీఆర్‌పీ గేమ్ జోన్‌కు వచ్చారు.ఘటన జరిగిన సమయంలో అక్షర్ తల్లిదండ్రులు రాజ్‌కోట్‌లో లేరు.

వీరు త్వరలోనే నగరానికి చేరుకోనున్నారు.అయితే మృతదేహాల గుర్తింపు కోసం అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.

"""/" / అగ్నిప్రమాదం నేపథ్యంలో గేమ్ జోన్ల నిర్వహణపై గుజరాత్ ప్రభుత్వం కఠినమైన నిబంధలను తీసుకొచ్చింది.

సరైన ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా పనిచేసే సెంటర్లను మూసివేస్తామని , వాటిని తిరిగి తెరిచేందుకు అనుమతి ఇవ్వడానికి ముందు తనిఖీలు నిర్వహించనున్నారు.

రాజ్‌కోట్ టీఆర్‌పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, ఈ కేంద్రానికి భాగస్వాముల్లో ఒకరైన యువరాజ్ సింగ్ సోలంకిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజ్‌కోట్ అగ్నిప్రమాదాన్ని గుజరాత్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.దీనిని మానవ నిర్మిత విపత్తుగా పేర్కొన్న ధర్మాసనం.

ఇలాంటి గేమ్ జోన్లకు తగిన అనుమతి విధానం లేదని న్యాయమూర్తులు జస్టిస్ బీరెన్ వైష్ణవ్, దేవన్ దేశాయ్ విమర్శించారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేసేందుకు అదనపు డీజీ (సీఐడీ, క్రైం) సుభాష్ త్రివేది నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

సిట్ తన నివేదికను 72 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన నార్నె నితిన్.. ఈ యంగ్ హీరోకు తిరుగులేదుగా!

వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన నార్నె నితిన్.. ఈ యంగ్ హీరోకు తిరుగులేదుగా!