కంగనా ఎఫెక్ట్ : పంజాబీ ఎన్ఆర్ఐ జంటపై హిమాచల్‌ప్రదేశ్‌లో మూకదాడి
TeluguStop.com
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్ఆర్ఐ జంటపై( NRI Couple ) స్థానికులు దాడి చేసిన ఘటన పంజాబ్‌లో( Punjab ) కలకలం రేపింది.
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Minister Kuldeep Singh Dhaliwal ) దగ్గరుండి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.
అమృత్‌సర్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇంగ్లాండ్‌లో ఉంటున్న ఎన్ఆర్ఐలతో పాటు పంజాబ్ పర్యటనకు వచ్చిన బాధితుడి సోదరుడు జోబంజిత్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసును చంబాలోని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు.
బాధితులను కన్వల్‌జీత్ సింగ్ (26),( Kanwaljeet Singh ) అతని స్పానిష్ భార్య యోలానాలా గార్సియో గోజాలెస్‌గా( Yolanala Garcia Gozzales ) గుర్తించారు.
వీరు గత 25 సంవత్సరాలుగా స్పెయిన్‌లో నివసిస్తున్నారు.రెండు వారాల క్రితం వారు కొన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి పంజాబ్ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని( Himachal Pradesh ) డల్హౌసీ, ఖజ్జియార్ ట్రిప్ ప్లాన్ చేశారు.
వారు జూన్ 10న డల్హౌసీకి చేరుకున్నామని, తెల్లవారుజామున 2 గంటలకు ఖజ్జియార్‌కు చేరుకున్నామని ఎఫ్ఐఆర్‌లో జోబంజిత్ పేర్కొన్నారు.
తమ కారును పార్కింగ్‌లో పెట్టి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు కారును తీస్తుండగా.
పార్కింగ్ ప్లేస్ కాంట్రాక్టర్, సిబ్బంది వారిని అడ్డగించినట్లుగా తెలిపారు.చండీగఢ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై( BJP MP Kangana Ranaut ) సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేయి చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ కాంట్రాక్టర్ వారిని బెదిరించాడని ఆయన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
"""/" /
పార్కింగ్ సిబ్బంది మరింత మంది స్థానికులను పిలవగా.కన్వల్‌జీత్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశారని.
ఈ ఘటనలో అతని చేయి, తలకు గాయాలయ్యాయని తెలిపారు.ఈ దాడిని అతని భార్య మొబైల్‌లో రికార్డు చేసిందని, అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దానిని బలవంతంగా డిలీట్ చేశారని ఆరోపించారు.
పోలీసులు వారిని ప్రథమ చికిత్స నిమిత్తం చంబా ఆసుపత్రికి తరలించారని, కానీ కేసు నమోదు చేయడానికి మాత్రం నిరాకరించారని పేర్కొన్నారు.
అయితే వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కన్వల్‌జీత్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. """/" /
బాబా బకాలాలోని పన్వా గ్రామంలో బాధితుల కుటుంబసభ్యులను కుల్దీప్ సింగ్ ధాలివాల్ పరామర్శించారు.
అనంతరం ఈ ఘటనలో జోక్యం చేసుకోవాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు.
ఈ కేసులో పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.తాను హిమాచల్ డీజీపీతో మాట్లాడటానికి ప్రయత్నించానని ధాలివాల్ తెలిపారు.
ఎఫ్ఐఆర్ కాపీని అందజేయడం కోసం మాత్రమే తాను హిమాచల్ సీఎం, డీజీపీలను కలవాలని ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పర్యాటకులను భయాందోళనలకు గురిచేస్తాయని ధాలివాల్ హెచ్చరించారు.
ఖైదీలను సింహాలకు ఆహారంగా వేసేవాడు.. ఎక్కడో తెలిస్తే..