వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం
TeluguStop.com
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ( Hazrat Nizamuddin Railway Station On The Outskirts Of Delhi )ఎన్ఆర్ఐకి చేదు అనుభవం ఎదురైంది.
రైల్వేస్టేషన్‌లో వీల్‌చైర్ సేవలు అందించినందుకు గాను రూ.10 వేలు వసూలు చేసిన ఘటన చోటు చేసుకుంది.
గత నెల 28న ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తన తండ్రికి వీల్ చైర్ సర్వీస్ అందించినందుకు గాను ఓ రైల్వే పోర్టర్ ఏకంగా రూ.
10 వేలు వసూలు చేశాడని బాధితుడి కుమార్తె పాయల్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన నార్తరన్ రైల్వే మండిపడింది.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోర్టర్‌ను గుర్తించిన అధికారులు అతడి నుంచి రూ.
9 వేలు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు.ఇలాంటి ఘటనలు భారతీయ రైల్వే ప్రతిష్టను దెబ్బతీస్తాయని, ప్రయాణీకుల నమ్మకాన్ని వమ్ముచేస్తాయని.
ఈ తరహా ఘటనలు ఏవైనా ఎదురైతే 139 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
దేశంలోని అన్ని రైల్వే స్టేషన్‌లలో వీల్ చైర్ సేవలు ఉచితంగా లభిస్తాయని స్పష్టం చేసింది.
అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలిపింది.
"""/" /
కాగా.కొద్దిరోజుల క్రితం ముంబైలో 10 నిమిషాల డ్రైవ్ కోసం ఎన్ఆర్ఐ నుంచి రూ.
2,800 వసూలు చేసిన ఓ టాక్సీ డ్రైవర్‌ను ( Taxi Driver )పోలీసులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 15న డి.విజయ్ అనే నాగపూర్‌కు చెందిన ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా నుంచి ముంబై విమానాశ్రయానికి అర్ధరాత్రి పూట చేరుకున్నాడు.
విజయ్ ఎయిర్‌పోర్ట్ ( Vijay Airport )నుంచి బయటికి వచ్చిన వెంటనే క్యాబ్ డ్రైవర్ వినోద్ గోస్వామి ఆయన వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలని అడగ్గా.
ఆయన విల్ పార్లే ప్రాంతానికి వెళ్లాలని చెప్పాడు. """/" /
గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత విజయ్‌కి నకిలీ యాప్‌ను చూపించిన గోస్వామి రూ.
2,800 ఛార్జీ అయినట్లుగా చెప్పి తీసుకున్నాడు.అయితే ఎక్కడో ఏదో తేడా జరిగిందని అనుమానించిన విజయ్.
వెంటనే తాను బస చేస్తున్న హోటల్ సిబ్బందిని ఆరా తీశాడు.తాము ఒక పికప్ సర్వీస్‌కు రూ.
700 ఛార్జ్ చేస్తున్నామని చెప్పారు.దీంతో తాను మోసపోయినట్లుగా గ్రహించిన విజయ్.
వెంటనే క్యాబ్ డ్రైవర్ మొబైల్ నెంబర్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదును మెయిల్ చేశాడు.
రూ.1.50 కోసం 7 ఏళ్ల పోరాటం.. గ్యాస్ ఏజెన్సీకి దిమ్మతిరిగే షాక్!