సెంట్రల్ ఎన్ఆర్ఐ సెల్‌కు 2022లో ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?
TeluguStop.com
2022లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎన్ఆర్ఐ సెల్‌కు .( NRI Cell ) ప్రవాస భారతీయ మహిళల నుంచి దాదాపు 400కు పైగా ఫిర్యాదులు అందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
గృహ హింస, పాస్‌పోర్ట్ జప్తు, భర్తలు విడిచిపెట్టడం, వరకట్న వేధింపులు, పిల్లల కస్టడీ వివాదాలు వంటి వాటిపై ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లుగా తెలిపారు.
పీటీఐ నివేదిక ప్రకారం.కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు( Ministry Of Women And Child Development ) 2022 జనవరి - మార్చి మధ్య 109 ఫిర్యాదులు అందగా.
ఏప్రిల్ - డిసెంబర్ వరకు 372 ఫిర్యాదులు అందినట్లుగా నివేదిక వెల్లడించింది.
"""/" /
భారత్, విదేశాలలో ఎన్ఆర్ఐ వివాహాలకు( NRI Marriages ) సంబంధించిన కేసులను పరిష్కరించే విషయంలో ఎన్ఆర్ఐ సెల్ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొందని నివేదిక తెలిపింది.
అత్తమామలు పాస్‌పోర్ట్‌లను జప్తు చేసిన సందర్భాలు , విదేశాలలో భర్తలు వారిని వదిలిపెట్టిన ఘటనలు ఇందులో ఉన్నాయి.
ఎన్ఆర్ఐ సెల్‌కు 2022లో మొత్తంగా 481 ఫిర్యాదులు అందినట్లు నివేదిక పేర్కొంది.సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమీషన్ (డబ్ల్యూసీడీ) సంబంధిత అధికారులకు దాదాపు 3500 లేఖలను జారీ చేసింది.
"""/" /
సాధారణ టెలిఫోనిక్ కౌన్సెలింగ్ సెషన్‌లతో పాటు ఏడాదిలో వాక్ ఇన్ ద్వారా దాదాపు 45 ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు నివేదిక వెల్లడించింది.
ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదుర్చుకునేలా 20 కేసుల్లో విచారణలు జరిగాయి.ఎన్ఆర్ఐ వివాహాల్లో హింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్ధతుగా నిలిచేందుకు విదేశాల్లోని భారతీయ దౌత్య మిషన్‌లలో వన్‌స్టాప్ సెంటర్లు , ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలని నివేదిక వివరించింది.
యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, కెనడా సహా తదితర దేశాలలో ఇలాంటి ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది.
ఎన్ఆర్ఐ వివాహాలలో ఎదురవుతున్న చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు గాను పంజాబ్ ఎన్ఆర్ఐ కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్ జస్టిస్ అరవింద్ కుమార్ గోయెల్( Justice Arvind Kumar Goel ) నేతృత్వంలో ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ ఈ విషయంలో తప్పుచేశారా ?