భారతీయుల బహిష్కరణ : యువతను ఆదుకోండి .. ప్రభుత్వానికి ఎన్ఆర్ఐ సంస్థ విజ్ఞప్తి

అక్రమంగా అమెరికాలో( America ) నివసిస్తున్న భారతీయులను( Indians ) ఫెడరల్ ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

ఏకంగా యూఎస్ మిలటరీ విమానాల ద్వారా తరలింపు ప్రక్రియను సైతం చేపట్టింది.ఇప్పటికే ఒక బ్యాచ్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ పరిణామాలపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ)( North American Punjabi Association ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అమెరికా నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్న యువకులు, బాలికలకు మద్ధతుగా పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

స్వదేశానికి తిరిగొచ్చిన వారికి మద్ధతు, వనరుల లేకపోవడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రమైన సామాజిక , ఆర్ధిక సవాళ్లకు దారి తీస్తుందని ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నం సింగ్ చాహల్( NAPA Executive Director Satnam Singh Chahal ) ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / పెరుగుతున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రానికి మరిన్ని సమస్యలు వస్తాయని నిరుద్యోగం, మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని ఆయన హెచ్చరించారు.

వీరిలో కొందరు చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం వుందని సత్నం సింగ్ అన్నారు.

చెదిరిన కలలు, ఆర్ధిక ఇబ్బందులు, మానసిక గాయాలతో వీరు స్వదేశానికి తిరిగి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి వారికి సమాజంలో సరైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చాహల్ తెలిపారు.

"""/" / అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, మానసిక స్థైర్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని సత్నం సింగ్ కోరారు.

ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి సమగ్ర వ్యూహాలను రూపొందించడానికి ఎన్ఏపీఏ సహా పలు సంస్థలతో సంప్రదింపులు జరపాలని కే తీవ్ర పరిణామాలు ఆయన పంజాబ్ ప్రభుత్వానికి సూచించారు.

మనం ఇప్పుడు గనుక సరైన నిర్ణయం తీసుకోకుంటే యువతకే కాదు.పంజాబ్ సామాజిక నిర్మాణం సహా మొత్తం ఆర్ధిక వ్యవస్ధ ప్రమాదంలో పడుతుందని సత్నం సింగ్ హెచ్చరించారు.