ఇకనుండి చికెన్ గంటలకొద్దీ కుక్ చేయాల్సిన పనిలేదు… క్షణాల్లోనే రెడీ!
TeluguStop.com
సాధారణంగా వెజ్ కంటే నాన్ వెజ్ అనేది వుడకడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది.
మటన్, చికెన్ ఐటెమ్ అనేది ఒక్కోసారి గంటల వ్యవధి తీసుకోవలసిన పరిస్థితి వుంటుంది.
అయితే ఇకనుండి వాటికోసం అంత సమయం వెచ్చించాల్సిన అవసరం రాకపోవచ్చు.అవును, ఇప్పుడు చెప్పుకోబోయే హార్డ్-బాయిల్డ్ స్టీమర్ గురించి మీరు వింటే ఖచ్చితంగా మీ ఇంటిలో వుండాలని అనుకుంటారు.
అవును, ఇందులో వండివార్చుకోవడం చాలా తేలిక మరి. """/" /
ఈ మెషిన్ లో గుడ్లు, దుంపలు, జొన్నకండెలు, కుడుములు వంటివాటిని కూడా ఆవిరిపై ఉడికించుకోవచ్చు.
ఆమ్లెట్స్, పాన్ కేక్స్ వంటి ఈటెమ్స్ వేయించుకోవచ్చు.చికెన్ వింగ్స్, గ్రిల్డ్ ఫిష్, చిల్లీ చికెన్, క్రిస్పీ ప్రాన్స్ ఇలా చాలా రకాల నాన్ వెజ్ ఇటెమ్స్ వుడికించుకోవచ్చు.
అంతేకాదండోయ్.కేక్స్, కట్లెట్స్ వంటివాటికీ కూడా ఈ కుక్‌వేర్ చాలా పర్‌ఫెక్ట్ గా వుంటుంది మరి.
దీని అడుగున, స్టీమింగ్ బౌల్‌లోనూ వాటర్ పోసుకుని.ఎగ్ ట్రే మీద ఆహారాన్ని లేదా గుడ్లను పెట్టుకుని ఉడికించుకుంటే సరి.
స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్‌ని.అడుగున నీళ్లు పోసుకుంటే స్టీమర్‌గా వాడుకోవచ్చు.
నూనె వేసుకుంటే గ్రిల్‌గానూ మార్చుకోవచ్చు. """/" /
అయితే దానికో ప్రత్యేకత వుందండోయ్.
వేగంగా, మంచిగా కుక్ అవ్వడానికి వీలుగా దానికి పెద్ద బౌల్ లాంటి మూత ఉంటుంది.
దాంతో హోల్ చికెన్ వంటివి క్షణాల్లోనే కుక్ అవుతాయి మరి.ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు టైమర్ స్విచ్ ఉంటుంది.
కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది.దానిని బట్టి అందులో వేసిన పదార్ధాలు ఉడికినట్టు మనం తెలుసుకుంటాము.
మరెందుకాలస్యం.మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరి!.
మానవత్వం మంట కలిసిన వేళ.. ఇంట్లోనుంచి అత్తమామలను గెంటేసిన కోడలు