ఇపుడు మీ కేవైసీ అప్డేట్ ఇంట్లోనే చేసుకోవచ్చు… బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank Of India ) వినియోగదారుల KYC వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకొమ్మంటోంది.

అయితే ఇపుడు మీ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి మీరు బ్యాంక్‌ను విజిట్ చేయాల్సిన అవసరమే లేదు.

మీరు ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే దానికోసం అప్‌డేట్ చేయవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశ్రమ అంతటా స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి వినియోగదారులు తమ KYC వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

గత సంవత్సరం వరకు KYCని అప్‌డేట్ చేయడానికి ఒక శాఖను విజిట్ చేయాల్సి వచ్చేది.

అయితే, జనవరి 5, 2023 నాటి సర్క్యులర్‌లో, ఆర్బీఐ KYC సమాచారంలో ఎలాంటి మార్పులు లేకుంటే.

వినియోగదారులు వారి ఇమెయిల్ అడ్రస్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఎటిఎంలు లేదా ఇతర వాటి ద్వారా ఆటో-డిక్లరేషన్‌ను సమర్పించాలని ప్రకటించింది.

కేవైసీ సమాచారంలో ఎలాంటి మార్పు లేనట్లయితే.KYC ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యక్తిగత కస్టమర్ నుంచి సంబంధించిన ప్రకటన సరిపోతుందని సర్క్యులర్ పేర్కొంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్( Internet Banking ) వచ్చిన తరువాత పెను మార్పులే చోటుచేసుకున్నాయి.

బ్యాంకు శాఖను విజిట్ చేయాల్సిన అవసరం లేకుండానే మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసేయొచ్చు.

కొన్ని సందర్భాల్లో మీ KYC డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్‌ని విజిట్ చేయాల్సి రావచ్చు.

మీ కేవైసీ డాక్యుమెంట్ల గడువు పూర్తయినా లేదా వ్యాలీడ్ కానట్లయితే సాధారణంగా అవసరం పడుతుంది.

కేవైసీ అనేది బ్యాంకులు తమ కస్టమర్‌ల ఐడెంటిటీని, అడ్రస్‌కు సంబంధించిన వివరాలను సేకరించే ప్రక్రియని మీకు వేరే చెప్పాల్సిన పనిలేదు.

"""/" / H3 Class=subheader-styleKYCని ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి:/h3p """/" / H3 Class=subheader-style1.

ముందుగా మీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి./h3p H3 Class=subheader-style2.

ఆ తరువాత ‘KYC’ ట్యాబ్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి./h3p H3 Class=subheader-style3.

స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించండి.మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీతో సహా మీ వివరాలను అందించండి/h3p.

H3 Class=subheader-style4.ఆధార్, పాన్, అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

మీ ప్రభుత్వ ID కార్డ్‌లకు రెండు వైపులా స్కాన్ చేశారని నిర్ధారించుకోండి./h3p H3 Class=subheader-style5.

ఇపుడు ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేస్తే తద్వారా సర్వీసు రిక్వెస్ట్ నంబర్‌ను పొందవచ్చు.

బ్యాంక్ SMS లేదా ఇమెయిల్ ద్వారా పంపవచ్చు./h3p.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 5, మంగళవారం2024