ఇప్పుడు టీడీపీ వంతు : నెల్లురూ రూరల్ లో కొత్త తలనొప్పులు ?

వైసిపి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీపై తిరుగుబాటు ఎగరవేసిన సంగతి తెలిసిందే.

టిడిపిలోకి వెళ్లేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు .ఈ మేరకు టిడిపి అదినేత చంద్రబాబు తోను శ్రీధర్ రెడ్డి మంతనాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్లుగానే ఆయన రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానంటూ శ్రీధర్ రెడ్డి ప్రకటించుకున్నారు.

ఈ వ్యవహారంపై వైసీపీలో కొద్ది రోజులపాటు పెద్ద అలజడి జరిగింది.శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేయగా, వాటిని తిప్పికొడుతూ వారి పైన శ్రీధర్ రెడ్డి విమర్శలతో విరుచుకుపడ్డారు.

ఇక వైసిపి వ్యవహారం సర్ధుమనుగుతోంది అనుకుంటూ ఉండగా.ఇప్పుడు శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద దుమారమే రేగుతోంది.

శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటన చేయకముందే ఎలా టికెట్ ప్రకటించుకుంటారు అంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు.

అదీ కాకుండా తమను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేసి , ఎన్నో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన శ్రీధర్ రెడ్డి కి మేము ఎందుకు సహకరించాలని వారు ఫైర్ అవుతున్నారట.

తాజాగా టీడీపీ రూరల్ టికెట్ పై ఆశలు పెట్టుకున్న అబ్దుల్ అజీజ్  ఫైర్ అవుతున్నారట.

ఇదే విషయం పై చంద్రబాబు వద్ద పంచాయతీ కూడా పెట్టినట్టు సమాచారం. """/"/ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పార్టీ లో చేర్చుకుంటున్నారా ? నెల్లూరు రూరల్ టికెట్ ఇస్తున్నారా అనే విషయం పై చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోవడం పై మరింత టెన్షన్ పడుతున్నారట.

ఇక లాభం లేదనుకునే తన రాజకీయ వ్యూహాలను పదునుపెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారట.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు కి వ్యాపార సంబంధాలు ఉండడంతో,  ఆయన ద్వారా శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఈ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న అజీజ్ కూడా చంద్రబాబు లోకేష్ లతో టిడిపి జిల్లా పెద్దల ద్వారా మాట్లాడించినట్లు సమాచారం.

"""/"/ అయితే టిడిపిలోకి శ్రీధర్ రెడ్డిని తీసుకునే అవకాశం లేదని టిడిపి పెద్దలు అంతర్గతంగా చెబుతున్నా,  దీనిపై తన ప్రయత్నాల్లో తాను ఉన్నారట.

ఆదివారం జిల్లా టిడిపి కార్యాలయంలో అబ్దుల్ అజిత్ నేతృత్వంలో జరిగిన నెల్లూరు రూరల్ కార్యకర్తల సమవేశం శ్రీధర్ రెడ్డి పై టిడిపి శ్రేణులు భగ్గుమన్నయట.

మూడు నెలల కాలంలో పార్టీ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవద్దని ఈ సందర్భంగా తీర్మానం చేశారట.

ఓ ముస్లిం మహిళ అయితే తమ  శవలపై వెళ్లి,  ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలంటూ ఆ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారట.

శ్రీధర్ రెడ్డిని టిడిపిలోకి తీసుకోవడం పార్టీలో ఏ ఒక్కరికి ఇష్టం లేదనే సంకేతాలను పంపించేందుకు అజీజ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.

అవిసె గింజలతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. తెలుసా?