ఇప్పుడు రవితేజ కి హిట్ పడకపోతే జరిగేది అదే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ( Ravi Teja ) .
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో అవ్వడం అంటే మామూలు విషయం కాదు.
కానీ రవితేజ చాలా ఇబ్బందులు ఎదుర్కొని సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగి ఇప్పుడు ఇండస్ట్రీలో తన సత్తా N చాటుకుంటున్నాడు.
"""/" /
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.
Bachchan ) గా నటిస్తున్నాడు.ఈ సినిమాతో కనుక ఆయనకు సక్సెస్ పడితేనే ఆయన మార్కెట్ అనేది మరింత పెరుగుతుంది.
లేకపోతే మాత్రమే కష్టమనే చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ సినిమా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ( Ravanasura, Tiger Nageswara Rao, Eagle ) లాంటి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయన మార్కెట్ పైన భారీ ఎఫెక్ట్ అయితే పడింది.
ఇక ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగాలంటే ఇప్పుడు రాబోయే రెండు సినిమాల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి.
లేకపోతే మాత్రం ఆయనకి హీరోగా అవకాశాలు తగ్గే ఛాన్స్ లు కూడా ఉన్నాయి.
"""/" /
ఇక మొత్తానికైతే రవితేజ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన యంగ్ హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ ల్లో మాత్రం వాళ్లతో పోటీ పడలేకపోతున్నాడు.
ఇక ఈ విషయం లో ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఈసారి ఎలాగైనా సరే మిస్టర్ బచ్చన్ తో పాటు భాను డైరెక్షన్ లో చేస్తున్నా సినిమాతో మరొకసారి భారీ సక్సెస్ సాధించి విజయ తీరాలని చేరాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
స్టార్ యాంకర్ ఝాన్సీ కూతురిని చూశారా.. ఈమె కచ్చితంగా హీరోయిన్ అవుతుందంటూ?