నవంబర్ లో బరిలోకి వరుస సినిమాలు.. ఈ నెల అయినా ఊపు తెచ్చేనా?

టాలీవుడ్ లో దసరా, దీపావళి పండుగలకు వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ పండుగలను తెలుగు ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ బాగా రాబట్టాలని చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

కానీ అందులో సగం కూడా బ్రేక్ ఈవెన్ కూడా కాలేక పోయాయి.ఈ సినిమాలు ఏవీ కూడా ఆశించిన ఫలితం చూపలేక పోయాయి.

ఇలా పండుగ సీజన్స్ మిస్ అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి లేకుండా పోయింది.

"""/"/ ఇక ఇప్పుడు రేపటి నుండి నవంబర్ నెల మొత్తం వరుస సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు.

రేపు రాజేంద్ర ప్రసాద్ నటించిన అనుకోని ప్రయాణం సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో పాటు నిన్నే చూస్తూ, రుద్రవీణ, ఫోకస్, వెల్ కమ్ టు తీహార్ కాలేజ్ వంటి చిన్న సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.

"""/"/ ఇక నవంబర్ నెలలో మాత్రం అల్లు శిరీష్ ఉర్వశివో రాక్షశివో రిలీజ్ కానుంది.

నవంబర్ 4న ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా రిలీజ్ కానుంది.

అలాగే అదే రోజు బనారస్, ఆకాశం, బొమ్మ బ్లాక్ బస్టర్ లాంటి సినిమాలు రానున్నాయి.

ఇక నవంబర్ లో మరో చెప్పుకోదగ్గ సినిమా సమంత యశోద. """/"/ ఈ సినిమా కూడా నవంబర్ లోనే రిలీజ్ కానుంది.

ఇంకా అల్లరి నరేష్ మారేడుమిల్లి ప్రజానీకం, దగ్గుబాటి అభిరామ్ అహింస, సుధీర్ బాబు హంట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

వీటిలో చాలా సినిమాల పేర్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.దీంతో ఈ నెల మొత్తం బాక్సాఫీస్ వెలవెల బోయేలా కనిపిస్తుంది.

మరి ఇందులో ఏ సినిమా అయినా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించినందుకు సాయిపల్లవికి సన్మానం.. ఈ హీరోయిన్ గ్రేట్ అంటూ?