ఏపీలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల
TeluguStop.com
ఏపీలో పోలీస్ నియామకాల నోటిఫికేషన్ విడుదలైంది.మొత్తం 6100 కానిస్టేబుళ్లు, 411 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు.
3,580 పోలీస్ కానిస్టేబుళ్లు (సివిల్ ) పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19న ఎస్సై, జనవరి 22న కానిస్టేబుళ్ల పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని కోరారు.
పోలీస్ శాఖలో రిటైర్ మెంట్స్, పదోన్నతులు, మరణాలతో పాటు ఇటీవల ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు వీక్ ఆఫ్ ఇస్తుండటంతో సిబ్బంది తక్షణ అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే పోలీస్ నియామకాలు చేపట్టేందుకు గత నెలలోనే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Validation Check 2026-03-24 19:38:18