ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యప్తు కొనసాగుతోంది.దీనిలో భాగంగా బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు అందించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.ఈనెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

బీఎల్ సంతోష్ వాట్సాప్, ఈ -మెయిల్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు పంపారు.

ఇదివరకే ఒకసారి నోటీసులు పంపగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా హాజరుకాలేదని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!