బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ ( Bangalore Rave Party ) కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు సినీ నటి హేమకు( Actress Hema ) నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరుకావాలని బెంగళూరు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులో నటి హేమకు పాజిటివ్ వచ్చింది.ఈ క్రమంలోనే హేమతో పాటు మరో 86 మందికి పోలీసులు నోటీసులు( Notices ) జారీ చేశారు.

వీరంతా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

కాగా రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్( Drugs ) స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు.

భర్తతో విడాకుల తర్వాత సంతోషంగానే ఉన్నా.. అమీర్ ఖాన్ భార్య కామెంట్స్ వైరల్!