రాజకీయ కక్షతోనే నోటీసులు..: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ నోటీసులపై స్పందించారు.ఈడీ నోటీసులు అందాయన్న ఆమె రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు.

నోటీసులను లీగల్ టీమ్ చూసుకుంటుందని తెలిపారు.ఏడాది కాలంగా ముగింపు లేని టీవీ సీరియల్ తరహాలో నడుస్తోందని విమర్శించారు.

ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసుల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అయితే జరిగేది అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఎప్పుడైనా చివరకు న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి నోటీసులు పంపుతుందని ఆరోపించారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేస్తున్న ఈడీ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు అందించింది.