జగన్‌తో దొస్తీ.. కేసీఆర్‌తో కుస్తీ.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాం ఏంటీ?

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య యుద్ధం కొనసాగుతోంది.తెలంగాణలోని గ్రామీణ ఉపాధి హామీ నిధులను అనధికార పథకాలకు మళ్లించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

తెలంగాణ ప్రభుత్వానికి మంత్రివర్గానికి నోటీసులు జారీ చేసింది.మళ్లించిన రూ.

152 కోట్ల నిధులను చెల్లించకుంటే తదుపరి వాయిదాలు నిలిపివేసే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.ఈ అంశం కోర్టు మెట్లెక్కడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో భాగస్వామ్యమైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిధుల మళ్లింపుపై  హైకోర్టు నిలదీసింది.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా  అంగీకరించింది.

కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ జగన్ ప్రభుత్వాన్ని ఇలా ఇబ్బంది పెట్టలేదు.మెుదటి నుండి ఏపీలో జగన్‌కు  సహకరిస్తునే ఉంది.

ప్రస్తుతం ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.తెలంగాణలో ప్రస్తుతం  బీజేపీ పుంజుకుంటుంది.

టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది.దీంతో ఏదో రకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో ఇలా చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

"""/"/ కానీ ఏపీలో బీజేపీకి పెద్దగా హోప్స్ లేవు.వైసీపీ బీజేపీకి బయట నుండి మద్దతు ఇస్తుంది.

వీరి మద్య అంతర్గత ఒప్పందాలు ఉన్న తరుణంలో జగన్ సానుకూలంగా కేంద్రం ప్రభుత్వం వ్వవహారిస్తున్నట్లు  అభిప్రాయం వ్యక్తమవుతుంది.

కేసీఆర్‌కు నోటీసులు, జగన్‌కు మద్దతు ఇవ్వడంపై ఇటు  టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు బీజేపీని విమర్శిస్తున్నారు.

 తెలంగాణలో కనీసం ఎనిమిది నెలల ముందుగానే ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి, ఈ ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ పై బీజేపీ యుద్దం ప్రారభించింది.

  ప్రస్తుతం ఈ అంశంపై ఎంత వరకు వెళుతుందో చూడాలి.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)