ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై( Amit Shah Fake Video Case ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీ పోలీసులకు( Delhi Police ) సమాధానం ఇచ్చారు.

ఫేక్ వీడియో షేర్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది అందించారు.

అయితే అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఫేక్ వీడియోను కాంగ్రెస్( Congress ) వైరల్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అందించారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల నోటీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు.

నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు: అల్లు అర్జున్