బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు..: నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) వ్యవహారంపై సినీ నటి హేమ( Actress Hema ) స్పందించారు.

ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు నటి హేమ తెలిపారు.ఈ క్రమంలోనే కన్నడ మీడియా మరియు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో నిజం లేదని పేర్కొన్నారు.

ప్రజలు ఎవరూ అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు.కాగా బెంగళూరులో రేవ్ పార్టీ వ్యవహారం సంచలనంగా మారింది.

ఈ వ్యవహారంపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు( Electronic City Police ) రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారని చెబుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు పదిహేడు ఎండీఎంఏ ట్యాబ్లెట్లతో పాటు కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పబ్లిక్ లో తమను తాము ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడే హీరోలు వీరే !