కరోనాకి బలైన టాలీవుడ్ యువ రచయిత

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలు తీసేసింది.ఇండియాలో కూడా ప్రముఖుల ప్రాణాలు హరించేసింది.

కరోనాతో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన వాళ్ళే కరోనా కాటుకి బలైపోయారు.చాలా సాధారణంగా కనిపించే భయంకరమైన వైరస్ గా కరోనాని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని మన నుంచి ఈ కరోనా మహమ్మారి దూరం చేసింది.

కరోనాతో పోరాడి చివరికి ఆయన ఊపిరి వదిలారు.దేశ వ్యాప్తంగా ఎంతో మందికి పాటలతో హాయిని అందించిన ఆయన గొంతుక కరోనా కారణంగా మూగబోయింది.

ఈ కరోనాతో ఎక్కువగా వృద్ధులే చనిపోతారని అందరూ భావించారు.అయితే తాజాగా టాలీవుడ్ లో ఓ యువ రచయిత కూడా కరోనా కారణంగా మృతి చెందాడు.

రచయితగా ఎంతో భవిష్యత్తు ఉంటుందని వచ్చిన అతనికి భవిష్యత్తే లేకుండా చేసింది. """/"/ రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో స్టోరీ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ రచయిత వంశీ రాజేశ్.

ఇటీవలే కరోనా బారినపడిన వంశీ రాజేశ్ చికిత్స పొందుతూ మృతి చెందారు.గత రెండు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఓ దశలో కోలుకుంటున్నట్టే అనిపించినా, అకస్మాత్తుగా పరిస్థితి విషమించింది.దాంతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ వంశీ రాజేశ్ తుదిశ్వాస విడిచారు.

ఈ యువ రచయిత మృతితో టాలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి.ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల స్పందిస్తూ, ఎంతో ప్రతిభ ఉన్న వంశీ రాజేశ్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.

వంశీ రాజేశ్ తో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!