రైతులకు గమనిక.. ఈ నెల 16 నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వేసవి సెలవులు
TeluguStop.com

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు 20 రోజులు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ డోలే లక్ష్మి ప్రసన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.


చాంబర్ ఆఫ్ కామర్స్ , కార్మిక సంఘాల కోరిక మేరకు ఈ నెల 16 నుండి జూన్ 4 వ తేదీ వరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.


జూన్ 6 నుండి మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.
జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?