ఈ హీరో తెలుగులో పేరున్న సంగీత దర్శకుడి కొడుకని మీకు తెలుసా…?

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ తదితర భాషలలో వందల సంఖ్యలో పాటలను కంపోజ్ చేసి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు "సాలూరి కోటేశ్వర రావు అలియాస్ కోటి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే కోటి మొదటగా తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన "అమ్మ దొంగ" అనే చిత్రానికి సంగీత స్వరాలను సమకూర్చాడు.

  ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఇలా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోల చిత్రాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.

అయితే సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 పూర్తి వివరాల్లోకి వెళితే 2007వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు చందు దర్శకత్వం వహించిన "నోట్ బుక్" అనే ఈ చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.

  కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ రాజీవ్  మాత్రం తన నటనా ప్రతిభను నిరూపించుకుని సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ తర్వాత తెలుగు హీరో తనీష్ హీరోగా నటించిన "మంచివాడు" చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 దీంతో రాజీవ్ కూడా సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం రాజీవ్ సింగర్ గా రాణించేందుకు సన్నద్దమ్మవుతున్నట్లు సమాచారం.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంగీత దర్శకుడు కోటి టాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలకు సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు.

 అలాగే ప్రతి ఆదివారం ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యేటువంటి "సరిగమప" మ్యూజిక్ కాంపిటీషన్ లో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.

స్విమ్ సూట్ లో సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత.. ఈ ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే!