చేతికి పెట్టుకొనే వాచీలు కాదు, ఇపుడు వేలికి పెట్టుకొనే వాచీలు వచ్చేసాయి!

వేలికి పెట్టుకొనే వాచీలు యేమిటీ? ఏమన్నా కామెడీ చేస్తున్నారా? అని అనుకోవద్దు! మీరు విన్నది అక్షరాలా నిజం.

ఇక్కడ మనం మన గడియారాలు కహానీ గురించి మాట్లాడుకోవాలి.మనిషి మొదట్లో గడియారాలను నడుముకు వేలాడదీసుకునేవారు అని మీలో ఎంతమందికి తెలుసు? నమ్మడం లేదు కదూ! ఒకసారి మన మహాత్మా గాంధీ( Mahatma Gandhi ) గారి బొమ్మని గుర్తుకు తెచ్చుకోండి.

ఆయన అప్పట్లో ఓ గడియారాన్ని తన బొడ్డులో దోపుకొని నడుస్తూ వుండేవారు.దానికి సంబందించిన ఫోటోలను మీరు చూసే వుంటారు.

"""/" / ఇక అదే మీకు నిదర్శనం.అప్పట్లో గడియారాలు నడుముకి కట్టుకొనేవారని.

ఇక ఆ తరువాత అందరికీ తెలిసిందే.కొంతకాలానికి చేతి గడియారాలు వచ్చాక, ముంజేతికి వాచీలు ధరించడం చాలా ఫ్యాషన్‌గా మారింది.

ఈ క్రమంలో ఎన్నో వాచీ కంపెనీలు పుట్టగొడుగుల్లగా పుట్టుకు వచ్చాయి.అయితే రానురాను మొబైల్‌ఫోన్లు వచ్చాక చేతికి వాచీలు ధరించే ఫ్యాషన్‌కు దాదాపుగా కాలం చెల్లింది.

అరుదుగా వాడుతున్నారు గాని, ఆ ప్లేసుని ఇపుడు చాలా స్మార్ట్ వాచీలు ఆక్రమించాయని చెప్పుకోవచ్చు.

"""/" / ఇక స్మార్ట్ వాచీల డామినేషన్ గమనించిన చాలా కంపెనీలు వాచీల వాడకాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి జాపనీస్‌ కంపెనీ 'క్యాసియో( Casio )' ఇటీవల 'స్టాస్టో స్టాండ్‌ స్టోన్స్‌' సంస్థతో కలసి వేలికి ఉంగరాల్లా తొడుక్కునే ఈ వాచీలను అందుబాటులోకి తెచ్చింది.

అవును, మీరు ఇక్కడ చదివింది అక్షరాలా నిజం.రకరకాల డిజైన్లు, రకరకాల మోడల్స్‌లో రూపొందించిన ఈ వాచీలను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగింది.

ఈ వేలి వాచీల్లో క్యాలికులేటర్, డిజిటల్‌ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు కూడా ఉండటం విశేషం.

కాగా వీటి ధరలు మోడల్స్‌ను బట్టి 3 డాలర్లు.అంటే కేవలం మన భారతీయ కరెన్సీలో రూ.

249 నుంచి మొదలవుతాయి.

మందులతో పని లేకుండా హై బీపీ నార్మల్ కావాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి!