వేణు స్వామి చేస్తున్నది తప్పే అనుకుంటే.. మరి జర్నలిస్టులు చేసేదేంటి..? సమాధానం చెప్పే దమ్ముందా ?

సాధారణంగా ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రభావితమైన వాళ్లు కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు.

దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నామో దానివల్ల మనకు కలిగే ప్రతికూల ప్రభావాలని కోర్టులో తెలియజేయాల్సి ఉంటుంది.

దీన్నే "లోకస్ స్టాండీ"( Locus Standi ) అంటారు.అయితే మన జర్నలిస్టులో 95 శాతం మందికి దీనికి అర్థం తెలియకపోవచ్చు.

దానివల్లే వాళ్ళు వేణు స్వామికి( Venu Swamy ) వ్యతిరేకంగా కోర్టు మెట్లు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.

ఆస్ట్రాలజిస్టు వేణుస్వామిపై ఇప్పుడు కేసు ఫైల్ చేయాలని భావిస్తున్నారట.వ్యక్తిగత జీవితాల్లోకి జ్యోతిష్యం పేరిట వేణు స్వామి వస్తున్నారంటూ జర్నలిస్టులు( Journalists ) కోర్టును ఆశ్రయించనున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.

అయితే జోష్యం అనేది చాలా మంది చెబుతున్నారు.కాకపోతే నమ్మటం నమ్మకపోవడం జనం ఇష్టం.

వేణు స్వామి నమ్మేది నిజమవుతున్నాయని ముందుగా జర్నలిస్టులే ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టారు.వీళ్ళే ఆయన చేత ఆయా సెలబ్రిటీల జాతకాలు చెప్పించారు.

సింపుల్ గా చెప్పాలంటే ఆయన చెప్పే ప్రతి మాట టాంటాం చేస్తున్నారు. """/" / వీళ్ళు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించారు.

స్వలాభం కోసం యూట్యూబ్ జర్నలిస్టుల నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వరకు అన్నీ కూడా విలువలను దొంగలోకి తొక్కాయి.

ఇప్పుడు వీళ్లు వేరే వాళ్ళని జడ్జి చేయడం అనేది చాలా ఫన్నీగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ఈరోజుల్లో మెయిన్ స్ట్రీమ్‌ మీడియానే సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో బాగా జోక్యం చేసుకుంటుంది.

విడాకులు తీసుకుంటారా, కలిసిపోతారా, సెలబ్రిటీల మధ్య అఫైర్ నడుస్తున్నాయా అంటూ వివిధ కోణాల్లో వారి లైఫ్‌లో చొరబడుతున్నాయి.

వీళ్లే జర్నలిజం విలువలను వదిలేశారు.తమ తప్పును కప్పిపుచ్చుకొని వేరే వాళ్ళ తప్పులను ఎత్తిచూపుతూ శిక్షించాలంటూ కోర్టుకు ఎక్కడం నిజంగా నవ్వు తెప్పించే విషయమే అని చెప్పుకోవచ్చు.

"""/" / వేణుస్వామికి మా అధ్యక్షుడు మంచు విష్ణు( Manchu Vishnu ) ఫోన్ కాల్ చేసి తన జోలికి రావద్దు అని చెప్పి ఉండొచ్చు.

ఆయన జోష్యం చెప్పినప్పుడు మా అధ్యక్షుడు రియాక్ట్ అయ్యాడు కానీ రాజ్ తరుణ్ ,( Raj Tarun ) లావణ్య, మాన్వి మల్హోత్రా వ్యవహారంలో మాత్రం ఏమాత్రం స్పందించలేదు.

మీడియా మాత్రం ఈ వ్యవహారాన్ని బాగా ఫోకస్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

వైసీపీ నేతల అఫైర్లు కూడా ప్రచారం చేస్తోంది మీడియా.ప్రజలకు ఉపయోగపడే విషయాలను ప్రచారం చేస్తూ రిపోర్ట్ చేస్తూ ఉంటే ఉపయోగం కానీ వీటి వల్ల ఏం ఉపయోగం అనేది సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న.

"""/" / కేవలం తమ సొంత టిఆర్పిని పెంచుకోవడానికి జర్నలిస్టులు సమాజానికి అవసరం లేనివి చూపిస్తూ కాలం గడుపుతున్నారు.

అంతేకాదు టిఆర్పి( TRP ) కోసం రాజకీయ నేతల, సెలబ్రిటీల వ్యక్తిగత సున్నితమైన విషయాలను భయం లేకుండా చూపించేస్తున్నాయి.

ఈ మీడియా చూపించడం వల్ల సోషల్ మీడియా యూజర్లు వాళ్లను టార్గెట్ చేయడం జరుగుతోంది.

దీనివల్ల ప్రైవసీ అనేది వారికి కరువైంది.అంతే కాదు మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు.

ఇంత రచ్చ చేసే జర్నలిజంతో పోలిస్తే వేణు స్వామి చెప్పిన చేసిన పెద్ద ద్రోహం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఆయన తనకు తెలిసిన విద్య ద్వారా ఒకరి జాతకాలు బాగోలేదని చెబుతున్నారు ఇలాంటివి నమ్మడం నమ్మకపోవడం ప్రజల ఇష్టం.

దీని వల్ల ఎవరికి జరిగేది ఏమీ లేదు.సెలబ్రిటీలు ఇలాంటి వాటిని పట్టించుకోరు కూడా.

ఇప్పుడు జర్నలిస్టులు అతను చేస్తున్నది తప్పు అంటూ కోర్టులకు వెళ్లడమే ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది అని అంటున్నారు.

అన్ స్టాపబుల్ ఫస్ట్ గెస్ట్ ఎవరో మీకు తెలుసా.. ఆ స్టార్ హీరోకే ఛాన్స్ దక్కిందా?