నటన మాత్రమే కాదు... మెగా ఫోన్ పట్టనున్న బాలయ్య హీరోయిన్?
TeluguStop.com
ధోని సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నటి రాధిక ఆప్టే అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించి సందడి చేశారు.
ఇలా తెలుగు తమిళ భాషలలో కలిసి సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.
తెలుగులో ఈమె రక్త చరిత్ర, బాలకృష్ణ నటించిన లెజెండ్ వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.
అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమై బోల్డ్ పాత్రలలో నటిస్తూ బిజీ అయ్యారు.
ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నటువంటి రాధిక ఆప్టే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాధిక ఆప్టే మాట్లాడుతూ తనకు సినిమాలలో నటించడం కన్నా సినిమాలను డైరెక్ట్ చేయడం చాలా ఇష్టం అని తెలిపారు.
త్వరలోనే తాను మెగా ఫోన్ పట్టబోతున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు ఇతర డైరెక్టర్ల సినిమాలలో నటించిన ఈమె త్వరలోనే డైరెక్టర్ గా మారబోతున్నానని తెలిపారు.
ఇక స్క్రీన్ ప్లే విషయంలో కూడా తాను ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఈమె తెలియజేశారు.
"""/"/
ఇలా డైరెక్టర్ గా మారాలనుకుంటున్నటువంటి ఈమె పాపులర్ డైరెక్టర్ల వద్ద శిక్షణ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారట.
ఇప్పటికే తన దగ్గర కొన్ని స్క్రిప్ట్ లు కూడా ఉన్నాయని, వాటితో స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలన్నదే తన కోరిక అని ఈ సందర్భంగా మనసులో మాటను బయటపెట్టారు.
తాను డైరెక్టర్ అయినప్పటికీ నటనను మాత్రం వదులుకోనని ఈమె తెలియజేశారు.
ఆ స్టార్ హీరోలకు ధీటుగా మోక్షజ్ఞ సక్సెస్ కావడం సాధ్యమేనా.. చరణ్ తర్వాత ఇతనేనంటూ?