ఇంటింటికి జగన్ కాదు.. ఇంటింటికి పవన్ !
TeluguStop.com
వచ్చే ఎన్నికల్లో జగన్( Jagan ) ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ( Janasena Party ).
ఆ దిశగా వేస్తున్న ప్రతి అడుగు కూడా వైసీపీకి గట్టిగానే షాక్ ఇస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో టీడీపీ కంటే జనసేన పార్టీనే కాస్త ముందుందని చెప్పవచ్చు.
రోడ్ల విషయంలోనూ, అభివృద్దిని ప్రశ్నించడంలోనూ, ఇలా అన్నీ విషయాల్లోనూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో జనసేన గట్టిగానే ప్రభావం చూపిస్తోంది.
దీంతో వైసీపీకి టీడీపీని ఎదుర్కోవడం కంటేముందు జనసేనను నిలువరించడమే మొదటి పనిగా ఉంది అందుకే పదే పదే పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు.
"""/" / ఇదిలా ఉంచితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పబ్లిసిటీపై దృష్టి పెట్టిన వైసీపీ సర్కార్.
జగనన్నే మా భవిష్యత్ అనే ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టింది.ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటికి మా నమ్మకం నువ్వే జగన్.
మా భవిష్యత్ నువ్వే జగన్ అనే స్టిక్కర్లు అంటించేందుకు శ్రీకారం చుట్టింది.అయితే అధికారంలో ఉన్న పార్టీ ఇలా పబ్లిసిటీ చేసుకోవడం ఎంటనే విమర్శలు అన్నీ వైపులా నుంచి వినిపిస్తున్నాయి.
అయినప్పటికి జగన్ సర్కార్ మాత్రం జగనన్నే మా భవిష్యత్ అనే ప్రోగ్రాం పట్ల ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
దీంతో టీడీపీ ( TDP )జనసేన పార్టీలు కూడా స్టిక్కర్ల ప్రోగ్రాం షురూ చేశాయి.
"""/" /
సైకో పోవాలి సైకిల్ రావాలి అనే స్టిక్కర్లను టీడీపీ సిద్దం చేసుకుంటూ ఉంటే.
జనసేన మాత్రం ఒకడుగు ముందుకెసి పవన్ రావాలి పాలన మారాలి అనే నినాదాన్ని అందుకున్నాయి.
ఇక మా నమ్మకం నువ్వే జగన్ అని అంటించిన స్టిక్కర్ల వద్దే " మాకు నమ్మకం లేదు జగన్.
మా నమ్మకం పవన్ " అనే స్టిక్కర్లను అంటిస్తున్నారు జనసైనికులు.ప్రస్తుతం ఈ స్టిక్కర్ల వ్యవహారం సోషల్ మీడియాల్లో బాగా వైరల్ అవుతున్న అంశం.
గతంలో కూడా రోడ్ల విషయంలో " గుడ్ మార్నింగ్ సిఎం సర్ " అనే కన్సెప్ట్ తో జగన్ సర్కార్ కు గట్టిగానే షాక్ ఇచ్చిన జనసైనికులు.
ఇప్పుడు మాకు నమ్మకం లేదు జగన్.మా నమ్మకం పవన్ అనే స్టిక్కర్లతో మరోసారి వైసీపీకి షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు.
మొత్తానికి పబ్లిసిటీ విషయంలో జగన్ ఏది అమలు చేస్తున్న.అదే విధంగా ఇతర పార్టీలు కూడా ఫాలో అవుతూ ప్రభుత్వానికి షాక్ ఇచ్చే పనిలో ఉన్నాయి.
సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన చైతన్య.. ఏంటో తెలుసా?