భారత సైనికుల ప్రతిభకు సినిమా హీరోలు కూడా పనికి రారు… చూడండి!

దేశ సైనికుల ప్రతిభ గురించి మనం కొనియాడలేం.ఈరోజు.

ఈ క్షణం.మనం క్ష్యేమంగా ఉన్నామంటే అంతా వారి చలవే అని ఎంతమందికి తెలుసు? వారెంత శక్తివంతులో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడంలో ప్రతిక్షణం అప్రమత్తంగా వుంటారు.ఈ క్రమంలో ఎదురైన ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు.

అయితే మనవాళ్లకు శిక్షణ ఎలా ఉంటుంది? వాళ్ల ప్రతిభ ఏవిధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూడండి.

శత్రువులు చుట్టు ముట్టినప్పుడు, తుపాకీ, కత్తులతో బెదిరించినప్పుడు వారు ఎలా ప్రతిఘటించాలో వారికి అరటిపండు తొక్క వలచి తినిపించిన మాదిరి శిక్షణ ఇస్తారు.

అలాగే తీవ్రవాదులు దాడులకు తెగబడ్డప్పుడు వాళ్లను ఎలా ధీటుగా ఎదుర్కోవాలో కూడా శిక్షణ ఇస్తుంటారు.

ఇంకా మనం కనివిని ఎరుగని రీతిలో సైనికులు ఎల్లప్పుడూ శిక్షణను పొందుతూ వుంటారు.

తాజాగా ఇలాంటి ఓ శిక్షణకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.

అందుకే ఇక్కడ ట్వీట్ చేయబడిన వీడియోని ఒకసారి తిలకించండి. """/"/ ఈ వీడియో చూస్తుంటే వివిధ సందర్భాల్లో సైన్యం వ్యవహరించే తీరు మన కళ్లకు కట్టినట్టు కనబడుతుంది.

ఈ వీడియోలు చూస్తే మన సైన్యానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్ సీన్స్, స్టంట్స్ మించి ఇవి వున్నాయి.

మీరు ఆరాధిస్తున్న సినిమా హీరోలు వీళ్ళ దగ్గర ఎందుకు పనికిరారు అంటే మీరు నమ్ముతారా? భారత సైన్యానికి సంబంధించి సైనిక దళాల 18వ ఉమ్మడి శిక్షణ కార్యక్రమం చైనా సరిహద్దులోని ఉత్తరాఖండ్ పరిధిలో జరుగుతోంది.

అక్కడి తీయబడిన వీడియోలే ఇవి.ఒకసారి చూసి తరించండి.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?